ఎయిర్‌పోర్టుకు పాపన్న పేరుకు డిమాండ్

30-09-2026 | 12:24pm

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): వరంగల్ విమానాశ్రయానికి బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్(Sarvai Papanna Goud) పేరు పెట్టాలని తెలంగాణా గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్(Prabhakar Goud) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని నలుమూలల చాటి చెప్పిన బహుజన వీరుడు అతని గౌడ జాతి కాకుండా అన్ని వర్గాలను పోరాట చైతన్యంతో తీర్చిదిద్ది గోల్కొండ కోటను కైవసం చేసుకున్న ధైర్యశాలి ఓరుగల్లు పక్కన ఉన్న కైలాసపూర్ లో పుట్టిన అతని స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కావున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విమానాశ్రయంగా నామకరణం చేయాలని, అన్ని వర్గాల మేధావులు నామకరణాన్ని ఏకీభవించాలని ప్రభాకర్ గౌడ్ కోరారు.

మరిన్ని వార్తలు