మృతి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
నేరేడుచర్ల, అక్టోబర్ 29(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త(BRS party worker) సంకబుడ్డి సైదులు ఇటీవల మృతి చెందడంతో,ఆయన కుటుంబానికి బీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ నాయకుడు పిల్లుట్ల రఘుచే ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు గురువారం కల్లూరు గ్రామానికి వెళ్లిన బీఆర్‌ఎస్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్యా శ్రీనునాయక్, మృతుడు సైదులు భార్య శివమ్మకు నగదు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులు,పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పంగ శ్రీను,బీఆర్‌ఎస్ నాయకులు జిలకర రామస్వామి,జింకల భాస్కర్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్,సైదులు,శివాజీ తదితరులు పాల్గొన్నారు.