కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎంపికలు

12-11-2026 | 07:21pm

కోదాడ నవంబర్ 12(విజయక్రాంతి): కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో(KITS Women’s Engineering College, Kodad) ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ గురువారం  తెలిపారు. హైదరాబాద్ కు  చెందిన  ప్రముఖ ఉత్పత్తి రంగ సంస్థ ఐన ఎంఆర్ఎఫ్  ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.

ఎంఆర్ఎఫ్  ఉత్పత్తి రంగ సంస్థ  మానవ వనరుల అధికారి  విజయకుమార్ ఆధ్వర్యంలో  నిర్వహించిన  ప్రాంగణ ఎంపిక లలో  కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల  బీటెక్ విద్యార్థినులు  44 మంది విద్యార్థి నులు ఎంపిక అయ్యారు.   

ఎంపిక అయిన వారికి  విద్యార్థి నులకు వార్షిక వేతనం  3,50,000/-  రూపాయలు  ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు విజయకుమార్ తెలిపారు.  ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి  ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ,  టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అభినందించారు.

మరిన్ని వార్తలు