సకాలంలో పనులు పూర్తిచేయాలి

23-11-2026 | 09:46pm

కోదాడ పెద్ద చెరువు బండ్ పనులను పరిశీలన

కోదాడ నవంబర్ 23(విజయ క్రాంతి): కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్(Pedda Cheruvu tank bund) పనులను నిర్ధేశించుకున్న విధంగా డిసెంబర్ చివరి కల్లా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavati Reddy) అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆమె కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా టీయూఎఫ్ఐడీసీ , అమృత్ 2.0 నిధులు రూ.11.14 కోట్లతో కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పనులు జరుగుతున్నాయన్నారు.

అక్కడే ఉన్న ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా, డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

కోదాడ పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్ల ఫోరం నాయకుడు కందుల కోటేశ్వరరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు