జగదేవపూర్ లో సామజిక తనిఖీ

23-11-2026 | 09:43pm

జగదేవపూర్,నవంబర్ 23, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేద్రంలో(Mandala Center) అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు,ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ(National Employment Guarantee), వి బి జి రాంజీ పథకం(VBG Ramji Scheme) 17 వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపిడిఓ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో చేసిన పని దినాలకు సంబందించిన కూలీలకు చెల్లించిన డబ్బుల లెక్కలు పూర్తిగా క్షుణంగా పరిశీలించిన్నట్లు తెలిపారు. ఆయా గ్రామల ఫీల్డ్ అసిస్టెంట్ లకు రికవరి ఫైన్ లు విధించారు.

మండలంలో రూ.1,33,197 వేల రూపాయలు రికవరీ రాసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎపిఓ సుధాకర్, ఎంపి ఓ ఖాజా మోహినూద్దిన్, పంచాయతీ రాజ్ ఏ, ఈ రాకేష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, సామజిక తనిఖీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు