స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన రాయినిగూడెం

23-11-2026 | 09:52pm
  1. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
  2. శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు రామంజి గౌడ్
  3. స్వాములకు శుభాకాంక్షలు తెలిపిన జగ్గయ్యపేట జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్

గరిడేపల్లి, నవంబర్ 23,(విజయ క్రాంతి): రాయినిగూడెం గ్రామంలో(Rainigudem village) స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నియమ నిష్ఠలతో మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు గురుస్వాముల ఆశీస్సులతో ఇరుముడులు ధరించి పవిత్ర శబరిమల యాత్రకు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, రాయినిగూడెం సర్పంచ్ రామాంజిగౌడ్, ఆయన మిత్రబృందం, స్వాములకు, గురుస్వాములకు,కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల జడ్పీటీసీ మండవ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు. మణికంఠుని నామస్మరణతో చేపట్టిన ఈ పవిత్ర యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. స్వాములందరూ సుఖసంతోషాలతో యాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని, అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు