అమాయక రైతులపై, పోలీసులు లాఠిచార్జీ.చేయడాన్ని ఖండిస్తున్నాం.
బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య.
తుంగతుర్తి (విజయ క్రాంతి): కరెంట్ కోతలతో వేసిన వరీపంట ఇంటికి చేరుతదో, చేరదో. అని బిక్కు, బిక్కు మంటూ ఆవేదన పడుతున్న రైతాంగం పై ప్రభుత్వం రైతు డిక్లరేషన్ (Government's Declaration for Farmers)పేరుతో మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందంగా ప్రభుత్వ విధానం ఉందని, అమాయక రైతులపై లాఠీచార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు.
తిరుమలగిరిలో అమాయక రైతులపై పోలీసులు లాటి చార్జి చేయడం దారుణమని పేర్కొన్నారు. యాసంగిలో వరీపంట వేయొద్దు అని ప్రకటించిన ప్రభుత్వం ఒకవేళ ఎవరైనా వరీపంట వేసుకుంటే ఆది విత్తనాలు ఖరీడు చేసేటప్పుడే డీలరు వద్దనే నేను వేసుకున్న వరీపంట మొలకేత్త కున్న, కరెంట్ లేక. నీళ్లు సరిపోక ఎండిపోయినా, డీలరు కు కాని, ప్రభత్వానికి కాని ఎలాంటి భాద్యత లేదని, జరిగే నష్టాన్ని నేనే భరిస్తానని అగ్రిమెంట్ తీసుకోవడమంటే, రైతంగాన్ని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు.
వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఏదేని కారణం చేత పంట వేసిన రైతు నష్ట పోతే పూర్తి భాద్యత ప్రభుత్వానిదే ఉండాలని అన్నారు. ఈ అగ్రిమెంటు విధానం అమలైతే నకిలీ విత్తనావిక్రయ కంపినిలూ, డీలర్లు పుట్టుకోస్తారని అన్నారు. ఇందులో నకిలీలతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కాయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయాని అన్నారు.
రైతు ను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా దివాలా తీయించే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాకా తప్పదని అన్నారు.
మోసపూరిత విధానాలతో, రైతంగాన్ని దివాలా తీయించిన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో.జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు గుడిపాటి వీరయ్య,మట్టిపెల్లి వెంకట్. కన్నెబోయిన కళ్యాణ్. గుగులోత్ సుధాకర్ నాయక్. తదితరులు పాల్గొన్నారు.