ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా డైరెక్టర్ గా డాక్టర్ దశరథ
కోదాడ సెప్టెంబర్ 30,(విజయ క్రాంతి): కోదాడ జనవాణి: కోదాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్,సీనియర్ సర్జన్,తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ దశరథ(Dr. Dasharath) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) డైరెక్టర్ గా నియమితులయ్యారు.ఈ మేరకు రెడ్ క్రాస్ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నియామకం పట్ల జిల్లా వ్యాప్తంగా వైద్యులు,రెడ్ క్రాస్ సభ్యులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుడిగా క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్ దశరథ ,వైద్య వృత్తిలో సీనియర్ సర్జన్ గా ఎంతో అనుభవం గడించారు.ప్రభుత్వ వైద్య సేవల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారు. కోదాడ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హాస్పిటల్‌లో మౌలిక వసతుల కల్పన ,పారిశుద్ధ్యం, పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించారు.నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు,రక్తదాన శిబిరాల నిర్వహణ,అవయవదానంపై అవగాహన,గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో ఆయన సేవలు అభినందనీయం.ఈ సందర్భంగా డాక్టర్ దశరథ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రెడ్ క్రాస్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు.రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు.