మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా శివప్రసాద్

30-09-2026 | 08:26pm

రాజాపూర్: మండలంలోని రంగారెడ్ది గూడ గ్రామం మత్స్య పారిశ్రామిక సంఘం ఎన్నికలను బుధవారం నిర్వహించారు. మత్స్య సహకార సంఘం సభ్యులు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శివప్రసాద్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి, కార్యదర్శి గా శివ కూమార్ ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిని డైరెక్టర్లను మండల ప్రత్యేక అధికారి రాధా రోహిణి గ్రామ సర్పంచ్ రేవతి ఆనంద్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.ఈకార్యక్రమంలో డైరెక్టర్లు సంజీవ్, వెంకటేష్, శివశంకర్, చంద్రశేఖర్,రాజు, కృష్ణయ్య, నరేష్, రవి,రమేష్ , శ్రీను,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు