స్వర్గీయ చింతకుంట్ల భిక్షం రెడ్డి విగ్రహావిష్కరణ

30-09-2026 | 08:11pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ చింతకుంట్ల భిక్షం రెడ్డి(Chintakumtla Biksham Reddy ) విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు గ్రామ కూడలిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి  హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించ సందర్భంగా, అయన మాట్లాడుతూ..

చింతకుంట్ల భిక్షం రెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా గ్రామ ప్రజలకు, రైతాంగానికి నిస్వార్థ సేవలు అందించారని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు చివరి శ్వాస వరకు పార్టీలో కొనసాగడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతకుంట్ల వీరారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్వాల రంగారెడ్డి, అనిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కొండేటి అరవింద్ రెడ్డి, నూకల భిక్షం రెడ్డి, కేసిడి నర్సిరెడ్డి, సంతోష్ రెడ్డి, మందడి వెంకటరెడ్డి, మందడి అశోక్ రెడ్డి, ఎస్.కె. సైదులు, కోట వీరస్వామి, పగిడి అశోక్, ఆర్ కె తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు