సివిల్ సప్లై కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు..

03-11-2026 | 11:10pm

పలు రికార్డుల స్వాధీనం

కరీంనగర్, నవంబర్ 3 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Vigilance and Enforcement officials) సోదాలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధాన్యం సేకరణ,బియ్యం కేటాయింపు, రైస్ మిల్లర్లకు కేటాయించిన లేవీ సరఫరా చేసిన బియ్యం వివరాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. గత 10 ఏళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించి వెంట తీసుకెళ్లినట్టు తెలిసింది. 

బియ్యానికి సంబంధించిన రికార్డులు, లావాదేవీల వివరాలను ప్రభుత్వానికి బకాయి పడిన డబ్బులు, డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల వివరాలకు సంబంధించి వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే జమ్మికుంట హుజురాబాద్ కు చెందిన రైస్ మిల్లర్లను సీఐడీ అరెస్ట్ చేసిన నేపధ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై శాఖలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు