ఐవిఓ రాష్ట్ర అధ్యక్షుడుగా గుండా మధు సూదన్ రావు..

23-09-2026 | 10:47pm

కోదాడ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(Indian Veteran Organization) రాష్ట్ర అధ్యక్షుడిగా కోదాడ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గుండా మధుసూదన్ రావు బుధవారం ఎంపికయ్యారు. ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జే. సెంగర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్మీలో రిటైర్ అయినప్పటి నుంచి ఈ సంఘంలో  ఏడు సంవత్సరాలుగా ఎనలేని సేవలందిస్తున్నారు, అంతేకాకుండా కోదాడ పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ఐ వి ఓ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు గుండా మధుసూదన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐ వి ఓ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు