నెక్నంపూర్‌లో రూ.1.56 లక్షలకు గణేష్ లడ్డూ

23-09-2026 | 11:06pm

దిలీప్ ప్రసాద్ దూబే కైవసం

మణికొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నెక్నంపూర్‌లో బాబు జగ్జీవన్‌రావు యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో(Ganesh festivities) భాగంగా గణనాథుడి లడ్డూ వేలం ఘనంగా జరిగింది. భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంలో లడ్డూకు డిమాండ్ నెలకొంది. చివరకు రూ.1,56,000లకు దిలీప్ ప్రసాద్ దూబే లడ్డూను కైవసం చేసుకున్నారు. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. వేలం కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో బాబు జగ్జీవన్‌రావు యువజన సంఘం కమిటీ సభ్యులు ఆర్. నరేందర్, మండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు