వినాయకుడి లడ్డూ ప్రసాదం వేలం

23-09-2026 | 11:16pm

గండీడ్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో కట్టకాడి వినాయకుడి వద్ద లడ్డూ(Vinayaka Laddu) ప్రసాదం వేలం నిర్వహించారు. ఈ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలంలో మొదటి లడ్డూను గాజుల గోపాల్ (మీసాల) రూ.11,000కు, రెండవ లడ్డూను గాజుల కృష్ణయ్య రూ.9,000కు, మూడవ లడ్డూను గాజుల లక్ష్మయ్య (హర్షిత్ కుమార్) రూ.5,500కు దక్కించుకున్నారు. అలాగే నాలుగవ లడ్డూను గాజుల వెంకటమ్మ (కేశవ్) రూ.6,000కు, ఐదవ లడ్డూను పిట్ల అంజిలయ్య రూ.5,500కు, ఆరవ లడ్డూను జోగు శాంతమ్మ రూ.2,000కు వేలంలో దక్కించుకున్నారు. వినాయకుడి లడ్డూ ప్రసాదం వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని పొందారు.

మరిన్ని వార్తలు