విద్యుత్ సమస్యలపై బీజేపీ ధర్నా

30-09-2026 | 08:46pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): రైతులకు సరైన విద్యుత్ సరఫరా చేయాలని, ముఖ్యంగా పంటలు కీలక దశలో ఉన్న సమయంలో త్రీఫేజ్ విద్యుత్ అంతరాయాలు(Three-phase power outages) లేకుండా అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధ్యక్షులు కొనతం నాగిరెడ్డి, చింతకుంట్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నేరేడుచర్ల విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమానికి స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం వద్దకు వచ్చి నాయకులతో మాట్లాడి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలపై వివరణ ఇచ్చారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో  

జిల్లా నాయకులు తాళ్ల.నరేందర్ రెడ్డి,సంకలమద్ది.సత్యనారాయణ రెడ్డి,ఆకుల జాతయ్య గౌడ్,ఏమిరెడ్డ్ శంకర్ రెడ్డి,,కొప్పుల లక్ష్మి నారాయణ,జూలూరి అశోక్,నందిపాటి హిందూజా,ఉరిమల్ల రామూర్తి,సీనియర్ నాయకులు బాల వెంకటేశ్వర్లు,బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల,పట్టణ నాయకులు,పాలకవీడు మండల అధ్యక్షులు నర్రి.నాయక్,కిసానమోర్చా అధ్యక్షులు తాటికొండ పరమేష్ రెడ్డి కాలం. నాగయ్య,,కాంపెల్లి నారాయణరెడ్డి,కాలం.శైలజ, మల్గి రెడ్డి రఘు,దేవిరెడ్డి , నాగిరెడ్డి,బుస్సా విమల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు