నిరుద్యోగుల గొంతుకగా మండలిలో ప్రశ్నిస్తా!
యువత సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
గరిడేపల్లి,నవంబర్ 24, (విజయక్రాంతి): నిరుద్యోగ యువత(Unemployed youth) ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, వారి హక్కుల సాధన కోసం పోరాడుతానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC candidate) ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని నిరుద్యోగ యువతను కలిసి వారి సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.యువత తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, నిరుద్యోగుల గొంతుకగా శాసనమండలిలో నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని, యువత భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడికి అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీహరి, వెంకటరమణ, రాంసైదులు, మన్సూర్ అలీ, అనంతు కర్ణాకర్, రామ్ మధు, తదితరులు పాల్గొన్నారు.