ప్రతిఒక్కరూ శాంతి, సమాధానంతో జీవించాలి
మన్నా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ మేకల ప్రసాద్ రావు.
సత్తుపల్లి. నవంబర్ 24. ( విజయ క్రాంతి ): సమాజంలో ప్రతిఒక్కరూ యేసుక్రీస్తు(Jesus Christ) సూచించిన ప్రేమా, శాంతి మార్గంలో నడవాలని మన్నా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ మేకల ప్రసాద్ రావు సూచించారు. మంగళవారం తల్లాడ పట్టణంలో సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి బైబిల్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసాద్ రావు మాట్లాడుతూ.
ఈ ప్రాంతంలో అనేకమంది సేవకులకు దుస్తులు, నిత్యవసర సరుకులు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పేద కుటుంబాలకు అండగా ఉన్నట్లు గుర్తు చేశారు. రానున్న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిసిసి ప్రెసిడెంట్ సాల్మన్, జోజి, సంతోష్, ఆంధ్రాప్ప, పెద్ద సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు.