అంకాపూర్ ను సందర్శించిన ట్రేని ఐఏఎస్ ల బృందం

24-11-2026 | 08:45pm

ఆర్మూర్, నవంబర్ 24 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని(Ankapur Village) మంగళవారం ఏడుగురు సభ్యులతో కూడిన ట్రైనీ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బృందం క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. ఈ బృందం గ్రామంలోని నూనె పంటల సాగు క్షేత్రాలు, పసుపు పంట పొలాలు, వివిధ రకాల కూరగాయల సాగు మరియు డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్న తోటలను సందర్శించి పంటల సాగు విధానాలను పరిశీలించారు.

ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ ఐఏఎస్  బృందానికి గ్రామ వ్యవసాయ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వివరించారు. ముఖ్యంగా అంకాపూర్ గ్రామంలో అనుసరిస్తున్న పంటల సాగు విధానం, పంటల మార్పిడి పద్ధతులు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు విత్తన శుద్ధి కేంద్రం పనితీరు గురించి అవగాహన కల్పించారు. అంకాపూర్ గ్రామం వ్యవసాయం, ఉద్యాన వనం, విత్తనోత్పత్తి, ఆధునిక సాగు పద్ధతుల ద్వారా సాధిస్తున్న పురోగతిని ట్రైనీ అధికారుల బృందం ఆసక్తిగా పరిశీలించింది.

మరిన్ని వార్తలు