విద్యతో పాటు విద్యార్థులకు సామాజిక స్పృహ అవసరం

29-10-2026 | 05:56pm

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ మద్దిమడుగు సైదులు

నేరేడుచర్ల,అక్టోబర్ 29(విజయ క్రాంతి): విద్యార్థులు విద్యతోపాటు సామాజిక స్పృహను కలిగి ఉండాలని,దేశసేవలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ మద్దిమడుగు సైదులు అన్నారు.

గురువారం నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ట్రస్ట్(Mera Yuva Bharat Trust) ఆధ్వర్యంలో సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....విద్యార్థులు చదువుకు ప్రాధాన్యమిస్తూనే సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వాలు,వివిధ సంస్థలు సామాజిక అంశాలపై నిర్వహించే పోటీల్లో విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని అన్నారు.చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతిని వై.అశ్విత,ద్వితీయ బహుమతిని సంజన,తృతీయ బహుమతిని ప్రత్యూష గెలుచుకున్నారు.విజేతలతోపాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.

అనంతరం వచ్చే నెల 4న సూర్యాపేటలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ‘వన్ నేషన్ –వన్ ఎలక్షన్’కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మేరా యువభారత్ ట్రస్ట్ ఆర్గనైజర్ భానోతు నాగేందర్ మరియు కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు