రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు
కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న ఏలువాక కుమారస్వామికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ
ముత్తారం, అక్టోబర్ 29 విజయ క్రాంతి): ముత్తారం మండలానికి చెందిన సీనియర్ రిపోర్టర్ ఏలువాక కుమారస్వామి రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడ్డారు. బుధవారం ఉదయం రామగిరి మండలం పన్నూరు సమీపంలో రహదారిపై పంది అడ్డుగా రావడంతో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో కుమారస్వామికి గాయాలయ్యాయి.
ప్రమాదం అనంతరం ఆయనను కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీతో పాటు కాంగ్రెస్ నాయకులు కె.వి. చారి, లక్కం ప్రభాకర్, తోడేటి కుమార్ తదితరులు కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న కుమారస్వామిని గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.