సర్పంచ్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ నేతల పరామర్శ

24-10-2026 | 06:21pm

 మోతె, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామ సర్పంచ్(Sarpanch of Urlugonda village) మొక్క వెంకటేశ్వర్లు గౌడ్ తల్లి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న  మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామ చిన్న వెంకట్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ నూకల మధుసూదన్ రెడ్డి, మొక్క నాగమ్మ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ(Kodad constituency) యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తండు సంజీవ్ గౌడ్, కూడలి సర్పంచ్ బర్మవత్ మల్సూర్ నాయక్, గోల్ తండా సర్పంచ్ దారావత్ భారతి లక్పతి నాయక్, నరసింహపురం సర్పంచ్ వాంకుడోత్ బేబీ గోదా నాయక్, రాయికుంట తండా సర్పంచ్ భూక్యా ఉపేందర్, రాఘవాపురం ఎక్స్‌ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, భల్లుతండా సర్పంచ్ భూక్యా మల్సూర్, బీక్యతండా సర్పంచ్ హలా వత్ స్వామి,  యూత్ కాంగ్రెస్ నాయకులు గుండాల నవీన్ యాదవ్, అర్వపల్లి శేఖర్ గౌడ్, కుశనపల్లి మహేష్, నిఖిల్, అనిల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు