ఎల్ నినో విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

24-10-2026 | 07:01pm

సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

ముకరంపుర, అక్టోబరు 24 (విజయ క్రాంతి): ఎల్ నినో విపత్తును(El Niño Disaster) ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు నీరు, కరెంటు(Water, electricity) విషయంలో పొదుపు పాటించాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) పిలుపునిచ్చారు. కరీంనగర్లో ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎన్నో ఏళ్ల తరువాత ఈ విపత్తు ఏర్పడిందని,ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన విధంగా సహకరించాలని కోరారు.

ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల(Rainy weather conditions) వల్ల నీటి సమస్య అదేవిధంగా విద్యుత్ కొరత సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ రెండిటి విషయంలో ప్రజలు పొదుపు పాటించాలని కోరారు. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన విపత్తు అయితే ప్రతిపక్షాలు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రభుత్వంపై తోసేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయని, ఇటువంటి సందర్భాలలో ప్రతి పక్షాలు భాద్యతగా వ్యవహరించాలని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ భాద్యతగా వ్యవహరించలేదా అని ప్రశ్నించారు.

ఎల్నినో విపత్తును ఎదుర్కొనేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సుడా ఛైర్మన్గా ఎంతో నిబద్ధతతో పని చేశానని, సుడాకు రెవిన్యూ జనరేట్ చేసి ఆ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇంకా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికే రీన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్నానని పేరొన్నారు.

కావాలని కొంతమంది లేనిదాన్ని ఉన్నట్టు చూపించి నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని, ఎవరేమిటో ప్రజలకు తెలుసని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ ఎండి తాజ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,లాయక్, షబానా మహమ్మద్, అస్థాపురం రమేష్, జీడి రమేష్, మామిడి సత్యనారాయణ రెడ్డి, సాయిరాం, బషీర్, భారీ, జిలుకర రమేష్, హనీఫ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు