దీక్షలో ఉన్న స్వాములకు అన్నదానం

24-11-2026 | 08:03pm

అయ్యప్ప స్వాముల సేవలో రమేష్ నాయుడు బ్రదర్స్

కోదాడ నవంబర్ 24 (విజయక్రాంతి): పట్టణంలోని విజయనగర్ బైపాస్ మెయిన్ రోడ్డులో అయ్యప్ప దేవాలయం(Ayyappa Temple) సమీపంలో రమేష్ నాయుడు బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తులకు సేవాభావాన్ని చాటుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా దాతలు శ్రీధర్ దంపతులు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. సీనియర్ గురుస్వామి గాలి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప స్వాములతో పాటు వివిధ రకాల దీక్షల్లో ఉన్న స్వాములకు అన్నప్రసాద వితరణ చేసినట్లు తలిపారు. ఈ కార్యక్రమంలో బర్మవత్ సీతారాం సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు