దేవరకోటలో దీపారాధన

24-11-2026 | 08:53pm

నిర్మల్ నవంబర్ 24 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అతి ప్రాచీనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం(Sri Lakshmi Venkateswara Temple) దేవరకోటలో పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి ఉంజల్ సేవ మరియు సహస్ర దీపాలంకరణ పెద్ద ఎత్తున నిర్వహించారు. కమిటీ చైర్మన్ ఆమేడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేలాది దీపాలను వెలిగించగా దివ్యకాంతలతో ఆలయం కొత్త శోభాయాని మనం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో స్వామివారికి ఉయ్యాలలో కూర్చోబెట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సాయంకాలము ఈ యొక్క కార్యక్రమము జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పూజారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు