అంబేద్కర్ రాజ్యాంగం వల్లే వెనుకబడిన వర్గాలకు న్యాయం: ఎంపీ నగేష్
ఆదిలాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం లభిస్తోందని ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) అన్నారు. మాల, మహార్, నేతకానీ అనుబంధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదిలాబాద్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం ఎంపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా అందరికి సమాన హక్కులు కల్పించిన గొప్ప మహానాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్, ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞ కుమార్, సభ్యులు భీంరావు వాగ్మారే, మేకల మల్లన్న, పాశం రాఘవేంద్ర, దాదా సాహెబ్ జాబాడే, శైలెందర్ వాగ్మారె, సుకన్య, ఉజ్వల ధుడే, అనిత బాయి తదితరులు పాల్గొన్నారు.