శ్రీరంగాపురంలో అన్నదానం

21-09-2026 | 07:49pm

కోదాడ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కోదాడ మున్సిపాలిటీ(Kodad Municipality) పరిధిలోని శ్రీరంగాపురం ఐదో వార్డులో ప్రజా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రజలకు ఆహారం అందించడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు అన్నప్రసాదాన్ని అందించారు.

మరిన్ని వార్తలు