కోహ్లీ సెంచరీ చేస్తే చరిత్రే!
గువాహటి: విరాట్ కోహ్లీ బ్యాట్ మరోసారి గర్జిస్తే.. దిగ్గజం సునీల్ గవాస్కర్(Kohli vs Gavaskar) పేరిట ఉన్న అరుదైన రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో(india national cricket team vs west indies cricket team players) తొలి వన్డేలో అజేయ శతకంతో అదరగొట్టిన కోహ్లీ.. ఇప్పుడు గువాహటి వేదికగా జరిగే రెండో వన్డేలో మరో సెంచరీపై కన్నేశాడు. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 88 బంతుల్లో 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 55వ వన్డే సెంచరీని నమోదు చేయడంతో పాటు 15 వేల ODI పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.
గవాస్కర్‌తో సమం.. ఇప్పుడు దాటడమే మిగిలింది!
వెస్టిండీస్‌పై కోహ్లీకి(Virat Kohli 2026) ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో 13వ సెంచరీ. మరోవైపు సునీల్ గవాస్కర్ కూడా వెస్టిండీస్‌పై 13 అంతర్జాతీయ శతకాలు సాధించారు. గవాస్కర్ చేసిన మొత్తం 13 సెంచరీలు టెస్టుల్లోనే రావడం విశేషం. కోహ్లీ మాత్రం టెస్టులు, వన్డేలు కలిపి ఈ సంఖ్యను అందుకున్నాడు. ఇక గువాహటి రెండో వన్డేలో కోహ్లీ మరోసారి మూడు అంకెల స్కోరు సాధిస్తే.. వెస్టిండీస్‌పై అతడి సెంచరీల సంఖ్య 14కు చేరుతుంది. దీంతో గవాస్కర్ రికార్డును అధిగమించి కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది.
గువాహటిలో కోహ్లీకి మంచి రికార్డే!
గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో కోహ్లీకి(Kohli West Indies Record) ఇప్పటికే మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన రెండు వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే అతడు రెండు సెంచరీలు నమోదు చేశాడు. వెస్టిండీస్‌పైనే 2018లో ఇదే మైదానంలో కోహ్లీ 140 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు అందరి చూపూ కోహ్లీ బ్యాట్‌పైనే ఉంది. తొలి వన్డేలో 139 పరుగులతో మెరిసిన కింగ్ కోహ్లీ.. గువాహటిలో(IND vs WI 2nd ODI) మరో సెంచరీతో గవాస్కర్ రికార్డును అధిగమిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.