పాక్ కెప్టెన్ ప్రపంచ రికార్డ్.. అభిషేక్ శర్మ రికార్డుకు బ్రేక్

14-10-2026 | 05:30pm

పాక్ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అరుదైన ఘనత!

టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ పరుగుల మోత మోగించాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో వరుసగా మూడు అర్ధశతకాలు సాధించి, మొత్తం 238 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక T20I Seriesలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరిట ఉన్న 229 పరుగుల రికార్డును అధిగమించాడు. Pakistan vs Sri Lanka T20 Seriesలో ఫర్హాన్ ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

శ్రీలంక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా రావల్పిండిలో జరిగిన టీ20 సిరీస్‌లో ఫర్హాన్ తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లో 53 బంతుల్లో 89 పరుగులు, రెండో మ్యాచ్‌లో 44 బంతుల్లో 73 పరుగులు, మూడో మ్యాచ్‌లో 47 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. ఇలా మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాది మొత్తం 238 పరుగులు నమోదు చేశాడు. గతంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ సాధించిన 229 పరుగులే ఈ విభాగంలో అత్యధికంగా ఉండేవి. తాజాగా ఫర్హాన్ ఆ మార్కును దాటి T20 Cricket World Recordను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మూడో టీ20లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. సిరీస్‌లో వ్యక్తిగతంగా ఫర్హాన్ అదరగొట్టినా, చివరి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపుతో సిరీస్ ముగిసింది.

మరిన్ని వార్తలు