పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు పరిశుభ్రత తప్పనిసరి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 5వ తరగతిలో 20 మంది విద్యార్థులు ఉన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠాలు చదివించి అభ్యసన స్థాయిని పరిశీలించారు.
1,2,3 తరగతులను కూడా పరిశీలించి విద్యార్థులు తప్పనిసరిగా ఏకరూప దుస్తులు ధరించాలని సూచించారు. అంగన్వాడీ, వంట గది, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్, పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. వాడుకలో లేని పాత సామగ్రిని తొలగించాలని సూచించారు.