మర్లపల్లి గ్రామంలో హై మాస్ లైట్ల ఏర్పాటు
08-10-2026 | 02:58pm
బోథ్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మండలంలోని మర్లపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి హైమాస్లైట్లను బిగించారు. దీంతో గ్రామంలో విద్యుత్తు సమస్య తీరిపోవడంతో పాటు రాత్రి పూట ప్రజలకు ఇబ్బంది కలవకుండా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి లు పాల్గొన్నారు.