కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన
బోథ్. సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి) ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా,ఓట్ చోరీ పై నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తూ ప్రజా సౌమ్య విలువలను రాజ్యాంగ హక్కుల ను కాలరాస్తూ అరెస్టులకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మెరుగు భోజన్న విమర్శించారు.
గురువారం ఏఐసీ సీ టీపీసీసీ డిసిసి పిలుపుమేరకు మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి బ్లాక్ డేగా పాటిస్తూ నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి ఎంపీల పైన జరిగిన చర్యలను ప్రభుత్వం కావాలని చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరంగా పోరాటంతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, డిసిసి జనరల్ సెక్రెటరీ వినయ్ కుమార్ రెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ షేక్ అబుద్, పీఏసీ సభ్యులు వడ్లకొండ సురేందర్,
రాజు రెడ్డి ఉప సర్పంచ్ విజయ రాజారెడ్డి, కుచిలాపూర్ ఉప సర్పంచ్ అరుణ్ కుమార్ ,గ్రామ అధ్యక్షులు భోజన్న, ధన్నూర్ గ్రామ అధ్యక్షులు అభిలాష్ రెడ్డి, మరల పెళ్లి గ్రామ అధ్యక్షులు రమేష్, మాజీ బ్లాక్ అధ్యక్షులు మెరుగు నరసింహ దాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్రార్, జలపతి ,మెరుగు రమణ , మారుతి దేవేందర్, ఫిరోజ్తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.