వాట్సాప్‌లో వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

08-10-2026 | 02:41pm

చందుర్తి, అక్టోబర్ 08 (విజయక్రాంతి): మండలంలోని బండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు.

చందుర్తి ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి సదరు ఉపాధ్యాయుడు వాట్సాప్(WhatsApp) ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు ఫోన్ కాల్స్ ద్వారా వేధింపులకు గురిచేశాడని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్(Investigation) కొనసాగిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి పూర్తి వివరాలను సేకరించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించి ఎవిడెన్స్(Evidence) ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు