బాలాజీ నగర్ లో దాహార్తి తలెత్తకుండా చర్యలు

08-10-2026 | 02:43pm

దామరచర్ల అక్టోబర్ :8: బాలాజీ నగర్ తండ గ్రామంలో నీటి సమస్య లేకుండా ప్రజలకు మెరుగైన నీటి సౌకర్యాలు(Water facilities) కల్పించేందుకు ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ దినేష్(RWS AE Dinesh) గురువారం గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సర్పంచ్ రాధ రమణ వాంకుడోత్, పంచాయతీ కార్యదర్శి సోమేష్,  గ్రామంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

గ్రామంలో ప్రస్తుతం ఉన్న నీటి అవసరాలు, ప్రజలకు అవసరమైన నీటి సౌకర్యాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ రాధా రమణ ఏఈ కి వివరించారు. గ్రామ ప్రజలకు నిరంతరంగా తాగునీరు అందేలా అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని కోరారు. 

గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి బద్య తండ , నీమ్యా తండ  ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోరు వేయించేలా,అంగన్‌వాడీ కేంద్రం వద్ద నల్లా ఏర్పాటుకు, అవసరమైన అభివృద్ధి పనులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.

మరిన్ని వార్తలు