లెజెండ్స్ టోర్నీ నుంచి పాక్ ఔట్
షార్జా, అక్టోబర్ 5 : దిగ్గజ ఆటగాళ్ల కోసం నిర్వహిస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ(World Championship of Legends tournament) (డబ్ల్యూసీఎల్) మూడో సీజన్ నుంచి పాకిస్తాన్ జట్టు(Pakistan team) వైదొలిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board)(పీసీబీ) ఎన్‌ఓసీ ఇవ్వకపోవడంతో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని పాక్ లెజెండ్స్ టీమ్ ఒక్క మ్యాచ్ ఆడకుండా వైదొలిగింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరగాల్సిన తమ మ్యాచ్‌లు రద్దయిన ప్రకటన వెలువడింది. మా ఆటగాళ్లు ఈ టో ర్నీలో ఆడలేకపోతున్నందుకు విచారిస్తు న్నాం. అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు’అని తమ ప్రకటనలో పేర్కొంది.
అయితే పీసీబీ ఈ టోర్నీ ఆడేందుకు కొన్ని షరతులు పెట్టింది. గతేడాది భారత్ తమతో మ్యాచ్ ఆడటానికి నిరాకరించినందుకు గానూ ఆ జట్టు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని పీసీబీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్‌ను డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్థాన్ లెజెండ్స్ తప్పుకోవాల్సి వచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో గత ఎడిషన్లో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యా చ్‌లను యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇం డియా ఛాంపియన్స్ తిరస్కరించింది. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్ ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. దాంతో భారత్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. భా రత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయాలన్న పీసీబీ మరో ప్రతిపాద నను కూడా భారత్ అంగీకరించలేదు.