క్యాప్టెన్ కీ రోల్
29-09-2026 | 11:53am
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి-2’పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగంలో ‘క్యాప్టెన్’గా కనిపించిన దుల్కర్ సల్మాన్.. సీక్వెల్‌లోనూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ మార్పులతో ఆయన పాత్రకు మరింత ప్రాధాన్యం పెరిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.