‘సత్య’ పాత్రతోనే గుర్తింపు

29-09-2026 | 10:55am

‘Student No.1’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా నటుడు రాజీవ్ కనకాల తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమా తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అన్నారు. ఈ చిత్రం తర్వాతే పూర్తిగా సినిమాల్లోకి వచ్చానని, ‘సత్య’ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యానని గుర్తుచేసుకున్నారు.ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ‘సత్య’ పాత్ర గురించి ప్రేక్షకులు గుర్తుచేసుకుని మాట్లాడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు ఎంతో ఇచ్చిన SS రాజమౌళి, కె. రాఘవేంద్రరావు, NTR, ఎం.ఎం. కీరవాణి, వినోద్‌తో పాటు చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘Student No.1’ తనకు ఇచ్చిన గొప్ప బహుమతి స్నేహాలేనని రాజీవ్ కనకాల అన్నారు. ఈ సినిమా ద్వారా ఏర్పడిన బంధాలు, ఆ తర్వాత కలిసి చేసిన సినిమాలు, పంచుకున్న అనుభవాలు 25 ఏళ్ల ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయని చెప్పారు.ఒకప్పుడు సినిమాను ‘ఫ్లాప్’ అన్నవాళ్లు ఉన్నప్పటికీ.. అదే చిత్రం 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందని రాజీవ్ కనకాల గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వార్తలు