నష్టాల్లో స్టాక్..సెన్సెక్స్, నిఫ్టీ డౌన్

29-09-2026 | 10:48am

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్‌(Trading with losses)ను ప్రారంభించాయి. ఉదయం 9.20 గంటల సమయానికి నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 22,714 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 231 పాయింట్లు క్షీణించి 72,531 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ 101.23 వద్ద, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 106.9 డాలర్ల వద్ద ఉంది. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.25 శాతానికి చేరింది. గత సెషన్‌లో S&P 500 0.77 శాతం, నాస్‌డాక్ 0.92 శాతం నష్టపోయాయి. ఈ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు