భారత క్రికెట్‌లోకి ముత్తూట్ ఫిన్‌కార్ప్

13-10-2026 | 05:05am
  1. స్వదేశీ మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్‌గా ఒప్పందం
  2. మ్యాచ్‌కు రూ.4.3 కోట్లు
  3. రూ.171 కోట్లతో బీసీసీఐతో డీల్

హైదరాబాద్, అక్టోబర్ 12 : భారత్‌లో క్రికెట్ అంటే వినోదమే కాదు వ్యాపారం కూ డా. అందుకే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు(Corporate companies) బీసీసీఐతో(BCCI) ఒప్పందాల కోసం క్యూ కడుతుంటాయి. కరోనా తర్వాత కూడా బీసీసీఐ ఆదాయం పెరుగుతూనే ఉంది. తాజాగా భారత క్రికెట్ జట్టు(Indian cricket team) స్వదేశంలో ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు(international matches), దేశవాళీ మ్యాచ్‌లకు(Domestic matches) ముత్తూట్ ఫిన్‌కార్ప్ టైటిల్ స్పాన్సర్ హక్కులు(Muthoot Fincorp Title Sponsor Rights) దక్కించుకుంది. మ్యాచ్‌కు రూ.4.3 కోట్లు చెల్లించేందుకు బీసీసీఐతో ఒప్పందం కుదిరింది. 2028 మార్చి 31 వరకూ ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది.

ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.150 నుంచి 171 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ భాగస్వామ్యం భారత పురుషుల, మహిళల సీనియర్ జట్లతో పాటు ఇండియా- ఎ పురుషుల జట్టు, ఇండియా- బి పురుషుల జట్టు, ఇండియా-ఎ మహిళల జట్టు, అండర్-19 పురుషుల, మహిళల జట్ల మ్యాచ్‌లకు వర్తించనుంది. దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు కూడా ఈ స్పాన్సర్‌షిప్ వర్తిస్తుంది.

భారత ప్రజలకు చేరువయ్యేందుకు క్రికెట్ మంచిమార్గమని ముత్తూట్ ఫిన్‌కార్ప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ జార్జ్ ముత్తూట్ చెప్పారు. బీసీసీఐతో తమ భాగస్వామ్యం మరింత అత్యుత్తమ స్థాయికి చేరు స్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు భారత క్రికెట్‌లోకి ముత్తూట్ ఫిన్‌కార్ప్ ను సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పారు.

మరిన్ని వార్తలు