నారాయణపేటకు పీఎం డీడీకేవై అవార్డు
- ఢిల్లీలో స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
- అధికారులకు కలెక్టర్ అభినందన
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ప్రధానమంత్రి ధన్ -ధాన్య కృషి యోజన(PM Dhan Dhanya Krishi Yojana) (పీఎం అమలులో విశిష్ట సేవలకు గానూ నారాయణపేట జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు(National-level recognition) లభించింది. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ(Union Ministry of Agriculture) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌ మాన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక(District Collector Ch Priyanka) అవార్డును అందుకున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను ఈ పురస్కారం నారాయణపేట జిల్లాకు దక్కింది.
ఈ సందర్భంగా కలెకట్ ప్రియాంక మాట్లాడుతూ.. అధికారులు అంకితభావంతో పనిచేయడం అభి నందనీయమన్నారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధం గా అమలు చేస్తూ, సంబంధిత శాఖలన్నీ స మన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ అవార్డు సాధనలో భాగస్వాము లైన జిల్లా అధికారులకు, వారి బృందాలకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.