రైతు డిస్కంకు ఆస్తులు, అప్పుల అప్పగింత పూర్తి

13-10-2026 | 05:15am
  1. ఉద్యోగులు, వినియోగదారులు కూడా..!
  2. ఉత్తర్వులు జారీచేసిన విద్యుత్తు శాఖ

హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు డిస్కంకు(Farmer DISCOM) ఆస్తులు, అప్పులు, నెట్‌వర్క్, వినియోగదారులు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు(Power Purchase Agreements), ఉద్యోగులు.. ఇలా అన్ని అ ప్పగింతలు పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (విద్యుత్తు శాఖ(Electricity Department)) ఉత్తర్వులు జారీచేసింది. ఈ పంపకా లకు సంబంధించి ఏర్పాటుచేసిన హైలెవల్ కమిటీ ఆగస్టు 22న సమావేశమై.. ఏయే వాటిని మూడు డిస్కంలలో ఎవరికి పంచాలనేదానిపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిని ప్రభుత్వానికి పంపింది. పరిశీలించిన ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేస్తూ మూడు డిస్కంల మధ్యన పంపకాలను అధికారికంగా పూర్తిచేసింది. గెజిట్ ప్రచురించిన నాటి నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

30,62,853 మంది వినియోగదారులు

ఇప్పటి వరకు ఉత్తర మండల విద్యుత్తు పంపి ణీ సంస్థ(Northern Zone Electricity Distribution Company) (ఎన్‌పీడీసీఎల్), దక్షిణ మండల విద్యు త్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు 30,60,821, అలాగే 512 ఎత్తిపోతల పథకాలు, 105 హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లు అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ) కనెక్షన్లు, 1145 సీపీడబ్ల్యూ / మిషన్ భగీరథ కనెక్షన్లు, 270 ప్రత్యేక డీటీఆర్‌తో ఉన్న నీటి కనెక్షన్లను రైతు డిస్కంకు బదిలీ చేశారు. అంటే 31.8.2026 నాటికి ఉన్న 30,62,853 కనెక్షన్లను రైతు డిస్కంకు బదిలీ చేశారన్నమాట.

నెట్‌వర్క్, పీపీఏలు బదిలీ

ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఉన్న 2,51,338 వ్యవసాయ డీటీఆర్ (డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్స్) ను, ఎస్‌పీడీసీఎల్ పరిధిలో ఉన్న 3,64,313 వ్యవసాయ డీటీఆర్‌లను.. అంటే మొత్తంగా 6,15,651 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్‌లను రైతు డిస్కంకు బదిలీ చేశారు. వీటి మొత్తం సామర్థ్యం 21,717 ఎంవీయే. వీటి మొత్తం విలువ రూ. 2123.46 కోట్లుగా నిపుణులు గణించారు. దీనితోపాటు ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లకోసం ఏర్పాటుచేసిన 2,51,213 కి.మీటర్ల పొడవైన ఎల్టీ లైన్లనుకూడా రైతు డిస్కం కు అప్పగించారు.

ఈ లైన్ల విలువ రూ. 1039 కోట్లుగా లెక్కించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను (పీపీఏ)కూడా మూడు డిస్కంలకు పం పిణీ చేశారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది.. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో ఉన్న 2324.8 మెగావా ట్ల సామర్థ్యం ఉన్న జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలతో కుదుర్చుకున్న పీపీఏలను రైతు డి స్కంకు కేటాయించారు. అలాగే సౌర విద్యుత్తుకు సంబంధించిన ముఖ్యమైన పీపీఏలనుకూడా రై తు డిస్కంకే కేటాయించారు. ఇలా మొత్తం 87 పీపీఏలను మూడు డిస్కంలకు పంపిణీ చేశారు. 

ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు

రైతు డిస్కంకు మొత్తం 2000 మంది ఉద్యోగులను కేటాయించారు. ఇందులో 660 మంది ఇంజనీర్లు, 1000 మంది  ఓ అండ్ ఎం స్టాఫ్, ఆర్టిజన్లు ఉన్నారు. అలాగే అకౌంట్స్, పీ అండ్ జీ కేటగిరీలో అడ్మినిస్ట్రేటివ్  స్టాఫ్‌గా 340 మందిని కేటాయించారు. ఆస్తులు, అప్పుల విషయంలో నూ మూడు డిస్కంల మధ్య స్పష్టమైన పంపకాలను పూర్తిచేసి అప్పగించారు. ఇప్పటి వరకు ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌ల పరిధిలో ఎత్తిపోతల పథకాల నుంచి రావాల్సి ఉన్న మొత్తం బకాయిలు రూ. 29,221.99 కోట్లను  రైతు డిస్కంకు కేటాయించారు.

అలాగే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీకి చెందిన రూ.9,122.53 కోట్లు, మిషన్ భగీరథ నుంచి రావాల్సిన రూ. 7497.51 కోట్లు, మున్సిపల్ శాఖ నుంచి రావాల్సిన రూ. 25.62 కోట్లు, వ్యవసాయానికి సంబంధించిన రూ. 287.63 కోట్ల బకాయిలను రైతు డిస్కంకు కేటాయించారు. అంటే రైతు డిస్కంకు వచ్చిన మొత్తం బకాయిలు రూ. 46,155.28 కోట్లన్నమాట. అలాగే ఎస్‌పీడీసీఎల్‌కు రూ. 6896.20 కోట్లు, ఎన్‌పీడీసీఎల్‌కు  రూ. 3729.57 కోట్ల బకాయిలను కేటాయించారు.

మొత్తం రుణాలనుకూడా మూడు డిస్కంలకు పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్‌గా తీసుకున్న రుణాల మొత్తం రూ. 62,037 కోట్లు కాగా.. ఇందులో నుంచి రైతు డి స్కం (టీజీఆర్‌పీడీసీఎల్)కు రూ. 46,126 కోట్లు, టీజీ ఎస్‌పీడీసీఎల్‌కు రూ. 13,082 కోట్లు, టీజీ ఎన్‌పీడీసీఎల్‌కు రూ. 2829 కోట్లను రుణభారంగా పంపకాలు చేశారు. దీనితోపాటు కాపెక్స్ రుణాల కింద ఉన్న రూ. 7555 కోట్లను ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లకు పంచారు. 

మరిన్ని వార్తలు