బిగ్ బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్
07-09-2026 | 01:30pm
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తాజా సీజన్‌లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో ఆమె ప్రవేశం హాట్‌టాపిక్‌గా మారింది. భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్(Mary Kom) బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. రింగ్‌లో ప్రత్యర్థులకు పంచ్‌లతో సమాధానం చెప్పిన ఈ ఛాంపియన్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో 105 రోజుల పాటు హౌస్‌మేట్స్‌తో కలిసి ఉండబోతున్నారు. దీంతో ఈ సీజన్‌లో మేరీ కోమ్ జర్నీ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
