112 కాల్‌తో తల్లీబిడ్డకు భద్రత
07-09-2026 | 02:02pm
బిడ్డతో వెళ్లిన మహిళను సకాలంలో గుర్తించిన దోమకొండ పోలీసులు
దోమకొండ, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బిడ్డను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళను దోమకొండ (Domakonda)పోలీసులు సకాలంలో గుర్తించి కాపాడారు. డయల్(Dial)–112కు సమాచారం అందిన వెంటనే పెట్రోకార్(Petrocar) సిబ్బంది కానిస్టేబుల్ సాయిబాబా, హోంగార్డు రాజు గాలింపు చేపట్టి గుండ్ల చెరువు కట్ట సమీపంలో మహిళను, చిన్నారిని గుర్తించారు. ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి, అనంతరం తల్లీబిడ్డను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. తక్షణ స్పందనతో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు. ఆపదలో ఉన్నవారు వెంటనే డయల్–112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.
