టాస్ మనదే.. ఉప్పల్లో పరుగుల వేట
14-10-2026 | 06:33pm
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ 4వ టీ20(IND vs WI 4th T20) మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉప్పల్ స్టేడియంలో బ్యాటింగ్కు అనుకూల పరిస్థితులు ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతాయనే అంచనాలు నెలకొన్నాయి. భారత బ్యాటర్లు, వెస్టిండీస్ హిట్టర్ల మధ్య పోరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కాగా, మ్యాచ్ సందర్భంగా 2200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.