రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థులు
కోహెడ, అక్టోబరు 27 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో(District-level SGF sports competition) ఆల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హుస్నాబాద్ ఆల్ఫోర్స్ హైస్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు విగ్నేష్, విష్ణు వర్ధన్ అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
400 మీటర్ల పరుగుపందెంలో విగ్నేష్, రజత పతకం సాధించగా, 100 మీటర్ల హర్డిల్స్ పోటీలో విష్ణు వర్ధన్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. వీరిద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక పై ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యతోపాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి తగిన శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించడం ద్వారా వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.