బీసీ లైజన్ ఆఫీసర్ గా రాజు..
బెల్లంపల్లి: శాంతిఖని అడిషనల్ మేనేజర్ గా పనిచేస్తున్న పీ రాజు మందమర్రి ఏరియా బీసీ లైజన్ ఆఫీసర్(BC Liaison Officer)గా నియమితులయ్యారు. మందమర్రి జీఎం ఆఫీసులో జీ ఎం ఎన్. రాధాకృష్ణ ఆయనకు ఘన సన్మానం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. అదేవిధంగా ఉన్నతాధికారులు, బీసీ సంఘాల నాయకులు కూడా పి. రాజును శాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతనంగా బీసీ లైజన్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన పి. రాజు మాట్లాడారు.
బీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మురళి, డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, మందమర్రి ఏరియా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.