జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవం
చేర్యాల,అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు(National Mala Mahanadu) 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల మాలమహానాడు వేసి జెండా ఎగరవేసి మాట్లాడుతు ఆనాటి నుండి నేటి వరకు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంతో పాటు,
తెలంగాణ ఉద్యమంలో, అనేక సామాజిక ఉద్యమాలలో, రోస్టర్ విధానం అమలులో తెలంగాణలో పనిచేసిన ఏకైక సంఘం జాతీయ మాల మహానాడు అని అన్నారు. అంబేద్కర్, పూలే ఆశయాలను, రాజ్యాంగ రక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ,
రిటైర్డ్ ఉద్యోగులు శ్రీరాం మలయ్య, కాటం సత్తయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి మేడిపల్లి నరసింహ, డివిజన్ అధ్యక్షులు చింతల విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరాం వెంకటేష్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చంద్ర శ్రీకాంత్, యూత్ నియోజకవర్గ ఇన్చార్జి పాకనటి భాస్కర్, చేర్యాల పట్టణ అధ్యక్షులు పుట్ట రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గుస్క వాసంతి తదితరులు పాల్గొన్నారు.