ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఎన్నిక...
అక్టోబర్ 6న ఎంఎస్‌ఎఫ్ మహాసభను విజయవంతం చేయాలి...
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): నారాయణరావుపేట మండల(Narayanaraopet Mandal) కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మండల కమిటీ ఎన్నిక సమావేశం(MRPS and MSP Mandal Committee Election Meeting) నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కన్వీనర్ ముక్కపల్లి రాజు మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై నూతన కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఫలాలను అర్హులకు అందేలా కృషి చేయాలని, మాదిగ జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.
అసమానతలు లేని సమాజ నిర్మాణమే ఎంఆర్పీఎస్ లక్ష్యమన్నారు. అక్టోబర్ 6న హైదరాబాద్ ఓయూలో జరిగే ఎంఎస్‌ఎఫ్ జాతీయ మండల ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు దండు శంకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి జేరిపోతుల లక్ష్మణ్ మాదిగ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.