కోహెడ బాడుగుల చెరువు అభివృద్ధికి రూ.2.40 కోట్లు నిధులు మంజూరు

18-09-2026 | 04:35pm

కోహెడ, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): కోహెడ మండల కేంద్రంలోని బాడుగుల చెరువు అభివృద్ధి కోసం పర్యాటక శాఖ (Department of Tourism) ద్వారా రాష్ట్ర రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (BC Welfare Minister Ponnam Prabhakar)సహకారంతో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism Minister Jupally Krishna Rao)రూ.2.40 కోట్లు నిధులు మంజూరైనట్లు కోహెడ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శెట్టి సుధాకర్ తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిధులను బాడుగుల చెరువు వద్ద అభివృద్ధి పనులకు, పార్కు నిర్మించడానికి ఇతర ఆభివృద్ధి పనుల కోసం  వినియోగించునున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, నిధుల మంజూరు కు సహకరించిన.. మంత్రి పొన్నం ప్రభాకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు