యువతను రెచ్చగొట్టే వాక్యాలు సరికాదు

22-10-2026 | 09:57pm

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్

కోహెడ,(విజయక్రాంతి): యువతను రెచ్చకొట్టే విదంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడటం సరికాదని.. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శెట్టి సుధాకర్ అన్నారు. మండలంలోని ధర్మసాగర్ పల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు మహిషాసురుని రూపంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఫోటోలు పెట్టి దహనం చేసి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన యువకులను ప్రోత్సహించే విధంగా మాట్లాడిన సతీష్ కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఘటనలో ప్రమేయం ఉన్నవారీ పై మాత్రమే చట్టానికి లోబడే విధంగా ఉండేలా చూడాలని పోలీస్ లకు విజ్ఞప్తి చేశామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఎవ్వరో నియోజకవర్గ ప్రజలు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారాని.. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నీ చూసి తట్టుకోలేక మతి భ్రమించి మాట్లాడుతున్నరాని ఘాటుగా విమర్శించారు.

గతం లో మీరు వింజపల్లి గ్రామానికి ఎమ్మెల్యే గా ఉన్నపుడు ఒక వితంతువు కుమారుడు మా అమ్మగారికి వితంతు ఫించన్ వస్తలేదని అడుగుతే అక్కడ లేని నాతో పాటుగా ఇంకో ముగ్గురు పై అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందిన మీరు మా నాయకుని గురించి మాట్లాడటం మీ అవివేకం అన్నారు. ఇక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకోకుండా    అయిదుగురు వ్యక్తుల పై మాత్రమే కేసులు పెట్టీ మిగతా వ్యక్తుల పై కూడా కేసుల పెట్టకుండా వదిలి పెట్టారని యువతను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన మీ తీరును చూస్తేనే అర్థం అవుతుందన్నారు. మంత్రి పొన్నం పై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ను డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు