పేరుకే జీహెచ్‌ఎంసీ.. లింక్‌ రోడ్లపై చీకట్లు!

22-10-2026 | 11:10pm

పటాన్ చెరు/అమీన్‌పూర్‌: అమీన్‌పూర్‌లోని కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్(Krishnareddy Peta ORR) నుంచి జానకంపేటకు వెళ్లే లింక్‌ రోడ్లపై(Link Roads) వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చీకట్లు అలుముకోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ వీధి దీపాల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలను ఏర్పాటుచేసి, రాత్రివేళ ప్రయాణం సురక్షితంగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు